Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తహసీల్దార్ వచ్చినా.. రిజిస్ట్రేషన్లు మాత్రం ఇంచార్జీవే!

తహసీల్దార్ వచ్చినా.. రిజిస్ట్రేషన్లు మాత్రం ఇంచార్జీవే!

వార్త 3 months ago

Devarkadra Tahsildar Issue: దేవరకద్ర తహసీల్దార్‌గా మహ్మద్ హర్షద్‌ బాధ్యతలు చేపట్టి 20 రోజులు గడుస్తున్నా నూతన తహసీల్దార్‌కు రిజిస్ట్రేషన్ అధికారాలు అప్పగించకపోవడం వివాదాస్పదంగా మారింది.

ఇంచార్జి తహసీల్దారే ఇంకా రిజిస్ట్రేషన్లు చేస్తుండటంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది నెలల క్రితం అప్పటి తహసీల్దార్ కృష్ణయ్య పదవీ విరమణ చేయగా అప్పటి నుంచి డిప్యూటీ తహసీల్దార్ దీపిక ఇంచార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది నెలల పాటు పూర్తిస్థాయి తహసీల్దార్‌ను నియమించలేదు.

Read Also:Telangana Political : కవితకు కోర్టు సమన్లు.. రేపు హాజరు కావాలన్న ఆదేశం

Devarkadra Tahsildar Issue: తహసీల్దార్ వివరణ: పొరపాట్లు జరుగుతాయనే భయమా?

ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం మహ్మద్ హర్షద్ నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటివరకు డిప్యూటీ తహసిల్దార్ దీపిక రెడ్డి ఆయనకు రిజిస్ట్రేషన్ అధికారాలు అప్పగించలేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్ హోదాలో భూ రిజిస్ట్రేషన్లను ఇంచార్జి తహసీల్దార్ దీపికనే చేస్తున్నారు.దీనిపై నూతన తహసీల్దార్ మహ్మద్ హర్షద్‌ను ' వార్త ' వివరణ కోరగా, "నేను కొత్తగా వచ్చాను. ఏమైనా పొరపాట్లు జరుగుతాయేమోనని రిజిస్ట్రేషన్ల బాధ్యతలు స్వీకరించలేదని అందుకే ఇంచార్జి తహసిల్దారే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని,తాను మిగతా రెవెన్యూ పనులు చూసుకుంటున్నానని తెలిపారు. ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు: రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha