Vamsi mohan: మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఏసీబీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి భారీ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వివరాలు బయటకు వచ్చినట్లు సమాచారం.
Read also: Harish Rao on Future City:అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు.. ఫార్మా సిటీ పునరుద్ధరణ!
Vamsi Mohan ACB raids Hyderabad
ప్రభుత్వ భూముల అక్రమాలపై షాకింగ్ వివరాలు
శేరిలింగంపల్లి ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ భూములపై అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. తర్వాత ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించినట్లు దర్యాప్తులో బయటపడింది.
vamsi mohan: రియల్టర్ల నుంచి ప్లాట్లు గిఫ్ట్‌గా తీసుకున్నట్లు గుర్తింపు
ఒక ప్రముఖ రియల్టర్ నుంచి 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసి అధికారులు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తెలంగాణ రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మరిన్ని కీలక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

