Dr Priyanka Medico KIMS: రాజమండ్రిలో దారుణమైన కారు ప్రమాదానికి గురైన మెడికో విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో గత ఆరు రోజులుగా ఆమె వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తలపై నుంచి కారు చక్రాలు వెళ్లిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆమెను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Read Also :Rajamahendravaram Medico Incident: అత్యంత విషమంగా ప్రియాంక ఆరోగ్యం
Dr Priyanka Medico KIMS: నేడు అత్యంత కీలకమైన ‘ఆప్నియా’ (Apnea Test) పరీక్ష
కోమాలో ఉన్న ప్రియాంక మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోయిందా లేదా అని కచ్చితంగా తేల్చేందుకు వైద్యులు నేడు ‘ఆప్నియా పరీక్ష’ (Apnea Test) నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత వచ్చే తుది ఫలితాన్ని (Final Result) వైద్యులు అధికారికంగా ప్రియాంక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు వివరించనున్నారు. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు తుది నివేదిక వస్తే, ఆమె అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరి ప్రాణాలను కాపాడవచ్చని కిమ్స్ వైద్య బృందం ఇప్పటికే కుటుంబ సభ్యులకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడిపి ఒక యువ డాక్టర్ జీవితాన్ని బలితీసుకున్న ఈ ఘాతుకంపై కోస్తాంధ్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

