Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీర్‌పేటలో భారీ చిట్ ఫండ్ మోసం! రూ. 2 కోట్లతో భార్యాభర్తలు జంప్

మీర్‌పేటలో భారీ చిట్ ఫండ్ మోసం! రూ. 2 కోట్లతో భార్యాభర్తలు జంప్

వార్త 2 months ago

Meerpet Chit Fund Scam: హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి కాలనీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కాలనీ అధ్యక్షుడిగా ఉన్న సురేష్ కుమార్, అతని భార్య గత పదేళ్లుగా 'వెంకట సాయి చిట్ ఫండ్స్' నిర్వహిస్తున్నారు.

ఇన్నాళ్లూ సక్రమంగానే చిట్టీల డబ్బులు చెల్లించడంతో కాలనీవాసులు వారిని గుడ్డిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే సుమారు 25 మందికి పైగా బాధితులు ఒక్కొక్కరు రూ. 2.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు వేశారు.

Read Also:Bangalore Crime: జ్యోతిష్యుడి మాయమాటలు.. బ్యూటీషియన్‌పై అరాచకం

అసలు రంగు బయటపడిందిలా

చిట్టీల గడువు ముగిసిన తర్వాత డబ్బులు అడిగితే.. సురేష్ కుమార్ దంపతులు వాయిదాలు వేస్తూ వచ్చారు. నమ్మకం కోసం ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో బాధితులకు అనుమానం వచ్చి నిలదీశారు. దాంతో సురేష్ కుమార్ అసలు స్వరూపం బయటపడింది. “డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు ఖంగుతిన్నారు.

 Hyderabad Crime

Meerpet Chit Fund Scam: పోలీసులకు ఫిర్యాదు

మోసపోయామని గ్రహించిన బాధితులు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులు సుమారు రూ. 2 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాలనీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ధాన్యం కాపాడబోయి అనంతలోకాలకు.. పిడుగుపాటుతో అన్నదాత మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha