Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొబైల్స్ నుంచి కార్ల వరకు అంతా ఏపీలోనే.. మంత్రి నారా లోకేష్

మొబైల్స్ నుంచి కార్ల వరకు అంతా ఏపీలోనే.. మంత్రి నారా లోకేష్

వార్త 1 week ago

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తయారీ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తోందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ బుధవారం సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్న అనేక ప్రముఖ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లోనే రూపుదిద్దుకుంటున్నాయని ఆయన గర్వంగా ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్లు, ఏసీలు, ద్విచక్ర వాహనాలు, కార్ల వరకు అన్నీ ఏపీలోనే తయారవుతున్నాయని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోందని లోకేష్ పేర్కొన్నారు.

Read Also: Driver Subramanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన జిల్లా కోర్టు!

Nara Lokesh: ప్రపంచ స్థాయి మౌలిక వసతులే కీలకం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపడానికి ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక వసతులే కారణమని లోకేష్ వివరించారు. ప్రభుత్వ నిర్ణయాల వేగవంతమైన, అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, బలమైన తయారీ వ్యవస్థ వల్ల కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోందని ఆయన విశ్లేషించారు.

ఏపీలో తయారు చేయండి.. ప్రపంచానికి అందించండి

రాష్ట్ర పారిశ్రామిక ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. “ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేయండి.. ప్రపంచం కోసం తయారు చేయండి” అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. లోకేష్ పంచుకున్న వీడియోలో రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రఖ్యాత కంపెనీల తయారీ యూనిట్లను ప్రదర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కర్నూలు ట్రాఫిక్ ఎస్సై సర్వీస్ నుంచి తొలగింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha