Dailyhunt
మోదీ కేబినెట్ మీటింగ్. కీలక నిర్ణయాలు రానున్నాయా?

మోదీ కేబినెట్ మీటింగ్. కీలక నిర్ణయాలు రానున్నాయా?

వార్త 4 days ago

అత్యవసర కేబినెట్ భేటీ

Cabinet Meeting : ఢిల్లీలో రేపు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం 11:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.

సాధారణంగా కేబినెట్ సమావేశాలు బుధవారం నిర్వహిస్తారు. అయితే ఈసారి ప్రత్యేకంగా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అంతర్జాతీయ పరిస్థితులపై చర్చ

ప్రభుత్వం అధికారిక అజెండాను ప్రకటించకపోయినా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో జరుగుతున్న మార్పులే ప్రధాన చర్చాంశంగా ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచిన నేపథ్యంలో చమురు సరఫరా పునరుద్ధరణపై భారత్‌కు కలిగే ప్రయోజనాలపై చర్చ జరగొచ్చు. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం లేదా ఆర్థిక విధానాల్లో మార్పులు వచ్చే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Para Boiled Rice Procurement: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి!

 Cabinet Meeting

తదుపరి రాజకీయ వ్యూహం

ఇటీవల లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రభుత్వానికి ఇది కీలక సమయం గా మారింది. ఈ నేపథ్యంలో తదుపరి రాజకీయ వ్యూహంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాల వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలి లేదా సవరణలతో కొత్త బిల్లును తీసుకురావాలా అనే అంశాలపై ప్రధాని మోదీ మంత్రులతో చర్చించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వీగిపోయిన బిల్లు.. కేంద్రం నెక్స్ట్ ఏంచేయబోతుంది ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha