Vizag Steel Plant Accident : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) విభాగంలో సంభవించిన ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవ ఉక్కు (Molten Steel) ఒక్కసారిగా కార్మికులపై పడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి బాధితుల కోసం భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులు సంస్థ నుంచి అందే ఇతర చట్టబద్ధమైన బెనిఫిట్స్‌కు అదనంగా ఉంటాయని స్పష్టం చేశారు.
Read Also : సత్వరమే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు!

Vizag Steel Plant Accident: విచారణకు నిపుణుల కమిటీ: బాధితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగం, నివాస వసతి
ఈ ప్రమాద తీవ్రతను పరిశీలించడానికి కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖపట్నం చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలలో అర్హులైన ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, వారి పిల్లల చదువుల ఖర్చులను సైతం ప్లాంట్ యాజమాన్యమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, సదరు ఉద్యోగి అసలు రిటైర్మెంట్ వయస్సు వచ్చేంతవరకు వారి కుటుంబాలు ప్రస్తుతం ఉంటున్న క్వార్టర్స్‌లోనే కొనసాగేందుకు అనుమతినిచ్చారు. ఈ దారుణ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలను సిఫార్సు చేయడం కోసం బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

