Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత

ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత

వార్త 2 weeks ago

Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలియడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, అనుచరులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

read also: Nellore Chit Fund Fraud: చిట్టీల పేరుతో రూ.4 కోట్ల మోసం.. దంపతుల అరెస్ట్!

కిడ్నీ సమస్యతో చికిత్స

గత కొన్ని రోజులుగా ముద్రగడ పద్మనాభం కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య సమస్యలు కాస్త ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే హైదరాబాద్ తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు రోజులుగా వైద్యులు ఆయనకు డయాలసిస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చికిత్స అందిస్తున్న డాక్టర్ల బృందం అధికారికంగా వెల్లడించింది.

Mudragada Padmanabham: పరామర్శించిన వైఎస్ జగన్

ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఫోన్ ద్వారా ఆరా తీశారు. ముద్రగడ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్… ఆయన అత్యంత త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.

పుకార్లను నమ్మవద్దన్న కుటుంబ సభ్యులు

మరోవైపు, ముద్రగడ ఆసుపత్రిలో చేరారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు షురూ అయ్యాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై కాపు శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, ముద్రగడ కుటుంబ సభ్యులు వెంటనే స్పందిస్తూ ఈ ప్రచారాలకు చెక్ పెట్టారు. “ఆయన క్షేమంగా ఉన్నారు. కేవలం రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చాం. దయచేసి ఇంటర్నెట్‌లో వచ్చే ఎలాంటి అవాస్తవాలను, తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దు” అని విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

భార్య భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha