Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడుసార్లు కేతన్ హత్యకు ప్లాన్..చివరికి అంతమొందించారు

మూడుసార్లు కేతన్ హత్యకు ప్లాన్..చివరికి అంతమొందించారు

వార్త 1 week ago

KETAN AGARWAL MURDER CASE : కేతన్ ను అడ్డుతొలగించుకునే పథకంలో భాగంగా అతడిని లోహగఢ్ కోటవద్దకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు అడిగిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించింది.

తొలుత మే 31న ఇద్దరూ లోహ్‌గఢ్‌ ఫోర్ట్‌కు వెళ్లారు. మళ్లీ జూన్ 4వ తేదీన కూడా అక్కడికి తీసుకెళ్లమని సియా అడగ్గా.. కేతన్ తల్లి అందుకు అంగీకరించలేదని, మరోసారి ప్రివెడ్డింగ్ షూట్‌లో భాగంగా బాలికి వెళ్లడానికి ముందే కేతన్‌ అడ్డు తొలగించుకోవాలని సియా భావించిందని..అయితే కేతన్ పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పోలీసులకు తెలిపింది. మా అందరి పాస్‌పోర్టులు ఉన్నప్పటికి… కేతన్‌ది మాత్రం కనిపించకపోవడంతో ఎక్కడన్నా పడిపోయిఉండొచ్చని అనుకున్నాం అని, దాంతో అంతా వెనక్కి వచ్చేశాం అని కేతన్ సోదరి వెల్లడించింది.

Read Also: Ketan Agarwal Pune Murder Case: కాబోయే భర్తను చంపేసి.. ఇన్‌స్టాలో కన్నీళ్ల నాటకం

 KETAN AGARWAL MURDER CASE

KETAN AGARWAL MURDER CASE: అప్పుడు ప్రాణాలతో బయటపడినా..

తర్వాత మళ్లీ లోహ్‌గఢ్ కోటకు వెళ్లడం గురించి సియా పట్టుబట్టడంతో జూన్ 14న ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ రోజు పైనుంచి తోయడంతో కేతన్ ఒక పొదను పట్టుకొని బతికిపోయాడు. పాము కనిపించిందని, అది కాటువేయకుండా కాపాడేందుకే తోశానని ఈ సందర్బంగా సియా చెప్పిన మాటలను కేతన్ నమ్మాడని అతడి తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించారు. అప్పుడు ప్రాణాలతో బయటపడినా జూన్ 18న అదే ప్రాంతంలో మరోసారి పన్నిన కుట్రకు కేతన్ బలైపోయాడని వాపోయాడు. జూన్ 18న సియా-కేతన్ లోయ వద్దకు చేరుకోగానే.. వారితో ఆమె ప్రియుడు చేతన్ కూడా చేరినట్లు పోలీసు విచారణలో గుర్తించారు. సియా, ఆమె ప్రియుడు చేతన్‌ కలిసి కేతన్‌ను లోయలోకి తోసి, ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

నిజానికి కేతన్ తో తనకు పెళ్లి ఇష్టం లేదని, అంతకుముందే మరో వ్యక్తికి తాను ప్రేమించానని సియా గోయల్ అతడితో చెప్పి ఉంటే..ఎవరికి ఏ సమస్య ఉండేది కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. . ఇలా పక్కా స్కెచ్ వేసి మర్డర్ చేయడం ద్వారా ఎంతో భవిష్యత్తు ఉన్న కేతన్ అగర్వాల్ ప్రాణాలు పోయాయని, ఈ నేరానికి పాల్పడినందుకు సియాగోయల్ సహా ఆమెకు సహకరించిన నిందితులకు జైలు జీవితం మిగిలిందని నెటిజన్లు అంటున్నారు.

Epaper: epaper.vaartha.com

బాబోయ్ ఆర్థిక నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha