Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై జట్టులో ముసలం నిజమేనా? హార్దిక్ పాండ్యాపై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

ముంబై జట్టులో ముసలం నిజమేనా? హార్దిక్ పాండ్యాపై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

వార్త 1 week ago

Hardik Pandya MI controversy : ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లు నిజమైతే, ఫ్రాంచైజీ కఠిన నిర్ణయం తీసుకోవాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించారు.

జట్టులో వాతావరణం దెబ్బతింటే కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలేయడమే ముంబైకి మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు హార్దిక్ దూరమవ్వడం ఈ చర్చకు దారి తీసింది.

జట్టులో విభేదాలు నిజమైతే తప్పించాల్సిందే

వీపు నొప్పి కారణంగా హార్దిక్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడలేదని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, జట్టులో గొడవలే అసలు కారణమని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. “ఆటగాడిగా హార్దిక్ విలువ అమోఘం, కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు ఉంటే మాత్రం అతడిని విడుదల చేయాలి. సమస్యలు లేకపోతే కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి” అని స్పష్టం చేశారు.

Read also: Medical shops strike: మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్!

 Hardik Pandya MI controversy

రూ. 27 కోట్ల విలువైన ఆటగాడు

హార్దిక్ పాండ్యా సామర్థ్యంపై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం రిషభ్ పంత్ అందుకుంటున్న రూ. 27 కోట్ల వేతనానికి హార్దిక్ కూడా అర్హుడని, ఆటపరంగా చూస్తే అతను టాప్ క్వాలిటీ ప్లేయర్ అని కొనియాడారు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ కనిపిస్తాడా లేక బుమ్రానే కెప్టెన్సీని కొనసాగిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చెన్నై ఐటీ హబ్‌లో భారీ మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha