Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఓటమిపై హార్దిక్ పాండ్యా రియాక్షన్ జట్టు వైఫల్యంపై స్పష్టమైన వ్యాఖ్యలు

ముంబై ఓటమిపై హార్దిక్ పాండ్యా రియాక్షన్ జట్టు వైఫల్యంపై స్పష్టమైన వ్యాఖ్యలు

వార్త 3 weeks ago

భారీ స్కోరు చేసినా ఓటమి ఎదురైన ముంబై

Hardik Pandya Reaction : ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమి చవిచూసింది. జట్టు స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంగీకరించాడు.

ఇది జట్టు మొత్తం వైఫల్యమని పేర్కొన్నాడు.

బౌలింగ్ లోపాలు మరియు కీలక తప్పిదాలు

మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదని తెలిపారు. కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడం కూడా ఓటమికి కారణమైందని చెప్పారు. అయితే బౌలర్లను మాత్రమే నిందించలేమని, ఇది అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

Read Also: MLA Bandaru Shravani Sree: నారా లోకేష్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అభినందనలు

 Hardik Pandya Reaction

అభిమానుల స్పందనపై పాండ్యా భావోద్వేగం

సొంత మైదానంలో అభిమానులు ప్రత్యర్థి ఆటగాళ్లను అభినందించడం తనను బాధించిందని చెప్పారు. అభిమానుల మద్దతు పొందాలంటే జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే సమస్యలను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha