Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో మళ్లీ కోవిడ్ పంజా.. స్వైన్ ఫ్లూ, కరోనాతో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ముంబైలో మళ్లీ కోవిడ్ పంజా.. స్వైన్ ఫ్లూ, కరోనాతో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

వార్త 1 week ago

Covid19 Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వాతావరణ మార్పుల వల్ల వైరల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (H1N1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి.

read also:Bullet Train: దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఒకే రకమైన లక్షణాలు.. పరీక్షలతోనే గుర్తింపు

తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు. ప్రముఖ బ్రీచ్ క్యాండీ వంటి ఆసుపత్రుల ల్యాబొరేటరీలలో రోజుకు కనీసం 7కు పైగా కోవిడ్ లేదా హెచ్1ఎన్1 (H1N1) కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వేర్వేరు వైరస్‌లు ఒకే సమయంలో వ్యాప్తి చెందుతుండటం, వాటి లక్షణాలు కూడా ఒకేలా ఉండటంతో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్లు పీసీఆర్ (PCR) టెస్టులను సిఫార్సు చేస్తున్నారు.

Covid19 Mumbai: ఆలస్యమైన వర్షాలు.. తేమతో పెరిగిన ముప్పు!

రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వాతావరణంలో విపరీతంగా పెరిగిన తేమ శాతమే ఈ వైరస్‌ల వ్యాప్తికి ప్రధాన కారణమని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్షా షా వివరించారు. ఈ తరహా వాతావరణం వల్ల వైరస్‌లు గాలిలో ఎక్కువ సమయం సజీవంగా ఉంటాయని తెలిపారు. నగరంలో వర్షాలు విస్తారంగా కురిస్తే వాతావరణం చల్లబడి, గాలి శుద్ధి అవుతుందని, తద్వారా వైరల్ వ్యాధుల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వైద్యుల హెచ్చరిక: సొంత వైద్యం వద్దు!

ప్రస్తుతం విస్తరిస్తున్న ఇన్ఫెక్షన్ల లక్షణాలు తీవ్రంగా లేకపోయినప్పటికీ.. వృద్ధులు, గర్భిణులు, డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు రాగానే మెడికల్ షాపులకు వెళ్లి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు నగర ప్రజలను కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

తమిళనాడులో విషాదం.. అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha