Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంచుకొస్తున్న ముడి చమురు ధరల ముప్పు..కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ

ముంచుకొస్తున్న ముడి చమురు ధరల ముప్పు..కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ

వార్త 3 months ago

ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురు, గ్యాస్‌లో సుమారు 20 శాతం వాటా ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే సాగుతుంది.

ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధించడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇది కేవలం తుఫాను ముందున్న ప్రశాంతత మాత్రమేనని అమెరికాకు చెందిన చమురు దిగ్గజ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఓడల్లోకి ఎక్కించిన నిల్వలు, వివిధ దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వల కారణంగా గత రెండు నెలలుగా మార్కెట్ కొంతమేర తట్టుకోగలిగింది. అయితే, ఈ “అనుకూల కాలం” ఇప్పుడు ముగిసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షెవ్రాన్, ఎక్సాన్ వంటి అంతర్జాతీయ చమురు సంస్థల ఉన్నతాధికారుల విశ్లేషణ ప్రకారం, మార్కెట్లో అందుబాటులో ఉన్న అదనపు నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం వేగంగా తరిగిపోతున్నాయి.

Read Also: Sea Turtle Viral Video: స్కూబా డైవర్ చెంప చెళ్లుమనిపించిన తాబేలు.. వీడియో వైరల్!

 Iran War

Iran War: చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి పడిపోయే ప్రమాదం

సాధారణంగా ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు ధరలు నియంత్రణలో ఉండటానికి తోడ్పడే ‘సేఫ్టీ మార్జిన్’ ఇప్పుడు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటివరకు నిల్వ ఉంచిన సరుకుతో కాలం వెళ్లదీసిన దేశాలకు, జూన్, జూలై నెలలు అత్యంత గండ కాలంగా మారనున్నాయి. హోర్ముజ్ జలసంధిని గనుక త్వరలో తెరవకపోతే, సెప్టెంబర్ నాటికి ప్రపంచ చమురు నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ రూట్ కనుగొన్న ఎంఎస్‌సి ఈ సంక్షోభం యొక్క ప్రభావం ముఖ్యంగా ఆసియా దేశాలపై తీవ్రంగా చూపుతోంది. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఛాయలు కనిపిస్తున్నాయి. అనేక రిఫైనరీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారడమే కాకుండా, రవాణా రంగంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికా భద్రతా సలహాదారు డీజే అవతారం.. నైట్ క్లబ్‌లో మార్కో రుబియో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha