Tamil Nadu Election Results 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది.
ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, ద్రవిడ కోటలో ‘దళపతి’ పాగా వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Read Also :Tamil Nadu Election Results 2026: తమిళనాడులో 'విజయ్' ప్రభంజనం.. త్రిషకు కీలక పదవి?
మ్యాజిక్ ఫిగర్ దిశగా టీవీకే పయనం

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాల మెజార్టీ అవసరం కాగా, తాజా సమాచారం ప్రకారం టీవీకే 108 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కేవలం పది స్థానాల దూరంలోనే మ్యాజిక్ ఫిగర్ ఉండటంతో, విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tamil Nadu Election Results 2026: క్షేత్రస్థాయిలో పెను మార్పులు
సాధారణంగా చెన్నై వంటి నగరాల్లో డీఎంకే బలంగా ఉంటుంది. అయితే, ఈసారి చెన్నై మినహా మిగిలిన రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థులు భారీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత మరియు మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం టీవీకేకు కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు మరియు విజయ్ అభిమానులు బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఒకవేళ టీవీకే ఒంటరిగా మెజార్టీ సాధించలేకపోతే, ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

