Dailyhunt
తమిళనాడులో 'విజయ్' హవా.. త్రిషకు కీలక పదవి?

తమిళనాడులో 'విజయ్' హవా.. త్రిషకు కీలక పదవి?

వార్త 5 days ago

Tamil Nadu Election Results 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026 భారత రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 110 స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకోబోతుండటం 'దళపతి' మేనియాకు నిదర్శనం.

అటు విజయ్ గెలుపు, ఇటు త్రిష పుట్టినరోజు ఒకే రోజు కావడం, ఆమె తిరుమల దర్శనం చేసుకోవడం ఈ వార్తకు మరింత హైప్ తీసుకొచ్చింది.

Read Also:Election Results: మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పారు: బండి సంజయ్

గతంలో ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సాధించిన రికార్డులను విజయ్ గుర్తు చేస్తున్నారు. అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోవడం ఇక్కడ విశేషం.విజయ్ విజయం ఖాయం కావడంతో, ఆయన ప్రభుత్వంలో నటి త్రిష కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊపందుకుంది. గత ఏడాది కాలంగా డీఎంకే నేతలు విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలపై చేసిన విమర్శలు ప్రతికూలంగా మారి, టీవీకేకు సానుభూతి పవనాలు తెచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి, వ్యూహ రచనలో త్రిష తెర వెనుక ఉండి పనిచేశారనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

 Vijay TVK victory Tamil Nadu Election Results 2026 Trisha role

Tamil Nadu Election Results 2026: బర్త్‌డే రోజున తిరుమలలో త్రిష

సరిగ్గా టీవీకే గెలుపు రోజే త్రిష పుట్టినరోజు కావడం, ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం యాదృచ్ఛికమే అయినా.. విజయ్ గెలుపు కోసమే ఆమె మొక్కులు తీర్చుకున్నారని అభిమానులు నమ్ముతున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, త్రిషకు నామినేటెడ్ పదవి లేదా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha