Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా ఆస్తుల పరిశీలనకు వస్తే స్వాగతిస్తా.. హరీశ్ రావు

నా ఆస్తుల పరిశీలనకు వస్తే స్వాగతిస్తా.. హరీశ్ రావు

వార్త 2 weeks ago

Harish Rao: తన భూములను పరిశీలించేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు.

తనకు ముందే సమాచారం అందించి వస్తే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసి, ఆప్యాయంగా భోజన వసతి కల్పించి మరీ తన పొలాలను చూపిస్తానని ఆయన ఆఫర్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read Also : KTR Press Meet: 'రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం'.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

 I welcome an examination of my assets: Harish Rao.

Harish Rao: భారీ పోలీసు బందోబస్తుపై వ్యంగ్యాస్త్రాలు

మూడు జిల్లాల నుంచి సుమారు 3,000 మంది పోలీసుల బందోబస్తుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు రావడాన్ని హరీశ్ రావు తప్పుబట్టారు. సిద్దిపేట ప్రాంతం ప్రేమ, ఆప్యాయతలు ,విశిష్టమైన ఆతిథ్యానికి పెట్టింది పేరని, అలాంటి ప్రాంతానికి రావడానికి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. భూముల పరిశీలన పేరిట డ్రోన్ కెమెరాలు పెట్టి రచ్చ చేయాల్సిన అవసరం లేదని, వచ్చి నేరుగా చూసుకోవచ్చని హితవు పలికారు.

తెరిచిన పుస్తకం నా జీవితం

తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని స్పష్టం చేసిన హరీశ్ రావు, తాను ఎన్నడూ భూకబ్జాలకు పాల్పడలేదని, ప్రజల సొమ్మును దోచుకోలేదని తేల్చి చెప్పారు. తన వద్ద ఉన్న ఆస్తులు, భూముల వివరాలన్నీ పారదర్శకంగా ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించానని, ప్రజలు తన నిబద్ధతను గమనించే వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు నిజాలు చెప్పాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.

ఎర్రవల్లి సరిహద్దు భూముల్లో రెండో రోజు సర్వే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha