Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా బ్యాటే ఎందుకు? జితేష్‌పై వైభవ్ సెటైర్

నా బ్యాటే ఎందుకు? జితేష్‌పై వైభవ్ సెటైర్

వార్త 2 months ago

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం తన బ్యాటింగ్‌తోనే కాదు, తన మాటలతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ మరియు ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ మధ్య జరిగిన ఒక సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్విస్తోంది.

Read Also:Shashi Tharoor Tweet on Vaibhav: "ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది!": శశి థరూర్

బ్యాట్ కోసం జితేష్ పట్టుబట్టగా..

ప్రాక్టీస్ సెషన్ సమయంలో జితేష్ శర్మ సరదాగా వైభవ్ దగ్గరికి వచ్చి అతని బ్యాట్ కావాలని అడిగాడు. వైభవ్ తన బ్యాట్ ఇవ్వగానే, జితేష్ థాంక్యూ చెప్పి వెళ్లబోతుండగా.. వైభవ్ వెంటనే స్పందించి "ఓ భాయ్.. నా బ్యాట్ నాకు ఇచ్చేయ్, దీని గురించి తర్వాత మాట్లాడదాం" అంటూ వెనక్కి తీసుకున్నాడు.

Vaibhav Suryavanshi: వైభవ్ వేసిన సెటైర్లు

ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ జితేష్ శర్మపై కౌంటర్ వేశాడు. "మీ టీమ్‌లో ఇంతమంది గొప్ప బ్యాటర్లు ఉండగా వారినెవరినీ అడగకుండా నా బ్యాట్ ఎందుకు అడుగుతున్నారు?" అని ప్రశ్నించాడు. దానికి జితేష్ సమాధానమిస్తూ.. తాను ఎవరినీ అడగలేదని.. కేవలం ఇతని బ్యాట్ మాత్రమే కావాలని కోరాడు. అప్పుడు వైభవ్ సూర్యవంశీ ఓ మాట ఇచ్చాడు. "నేను మీకు ముందే చెప్పాను కదా.. ఐపీఎల్ ముగిసిన తర్వాత నా బ్యాట్ మీకు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కావాలని పట్టుబట్టడం ఏంటి?" అని వైభవ్ సూర్యవంశీ సరదాగా నిలదీశాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

చెపాక్‌లో రసవత్తర పోరు: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై ఢీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha