Donald Trump: తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు తాను హాజరుకాలేకపోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వ అత్యవసర వ్యవహారాల దృష్ట్యా తాను వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లోనే ఉండటం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత సోషల్ మీడియా వేదికైన 'ట్రూత్ సోషల్' (Truth Social) ద్వారా పంచుకుంటూ, కొత్త దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. 48 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్‌ను బహామాస్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఒక ప్రసంగ కార్యక్రమంలో ఉన్న ట్రంప్, నిజానికి ఈ వీకెండ్‌ను న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్‌లో గడపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకుని శుక్రవారం సాయంత్రానికే నేరుగా వైట్‌హౌస్‌కు చేరుకుంటున్నారు.
Read Also: Tulsi Gabbard Resigns: అమెరికా డీఎన్‌ఐ పదవికి తులసి గబార్డ్ రాజీనామా
Donald Trump
ట్రంప్ జూనియర్ గత వైవాహిక బంధాలు
డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఇది రెండో వివాహం.
- 2005 - 2018: గతంలో ఆయన 2005లో వెనెసాను వివాహం చేసుకోగా, 13 ఏళ్ల బంధం తర్వాత 2018లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు.
- 2020: ఆ తర్వాత ఫాక్స్‌న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో నిశ్చితార్థం జరిగినా, కొన్ని కారణాల వల్ల అది రద్దయింది.
- గతేడాది: మోడల్ బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం (Engagement) జరగ్గా, ఇప్పుడు వారు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
Donald Trump: ఇరాన్‌పై సైనిక చర్యలు - వైట్‌హౌస్‌లో అత్యవసర భేటీ
ట్రంప్ పెళ్లికి దూరంగా ఉండటానికి ప్రధాన కారణం ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణమేనని తెలుస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలు గనుక కొలిక్కి రాకపోతే, ఆ దేశంపై ఒకేసారి భారీ సైనిక దాడి చేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని ట్రంప్ గట్టిగా యోచిస్తున్నారు.ఇందుకోసం శుక్రవారం శ్వేతసౌధంలో ఉన్నత స్థాయి జాతీయ భద్రతా బృందంతో ఆయన అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ కీలక సమీక్షలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌లు పాల్గొన్నారు.
క్యూబాపై నజర్ & అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు
అమెరికా కేవలం ఇరాన్ మాత్రమే కాకుండా, క్యూబాపై కూడా దృష్టి పెట్టినట్లు నివేదికలు చెప్తున్నాయి. క్యూబాపై సైనిక చర్యల అవకాశాలను కూడా అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి ముమ్మర దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్ చేరుకుని, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీతో భేటీ కానున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

