Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా?.. వేడి నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయా?.. వేడి నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

వార్త 3 weeks ago

Mailardevpally Incident: చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం.. ఒక్కోసారి ఊహించని విషాదాన్ని మిగుల్చుతోంది. ఇంట్లోనే సురక్షితంగా ఉంటారని భావించిన పిల్లలు కూడా ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన అందరి గుండెలను పిండేసింది. అప్పటివరకు ఇంట్లో ఆడుకుంటూ సందడి చేసిన నాలుగేళ్ల చిన్నారి.. కాసేపటికే వేడి నీళ్ల బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది.

హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ వేడి నీళ్ల బకెట్‌లో పడి మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కంటిముందే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Read Also : Lalaguda Couple Suicide: క్షణిక ఆవేశంలో తీవ్ర నిర్ణయం.. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య

 Life cut short at just four years… Toddler dies after falling into a bucket of hot water.

Mailardevpally Incident: ఫోన్ కాల్ తెచ్చిన ముప్పు.. ప్రమాదం జరిగిందిలా..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఉపాధి నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటోంది. వారి నాలుగేళ్ల కుమార్తె మానస ఇంట్లో ఆడుకుంటోంది. పాప స్నానం కోసం తల్లి వాటర్ హీటర్ తో బకెట్‌లో నీటిని వేడి చేస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో తల్లికి ఒక ఫోన్ కాల్ రావడంతో మాట్లాడటానికి కొద్దిసేపు బయటకు వెళ్ళింది. అదే సమయంలో ఆడుకుంటున్న చిన్నారి మానస ప్రమాదవశాత్తూ ఆ వేడి నీళ్ల బకెట్‌లో పడిపోయింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని మానసను బకెట్ నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే వేడి నీటి వల్ల పాప ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మానస ప్రాణాలు కోల్పోయింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కంటిముందే లేకపోవడంతో ఆ కుటుంబంలో తీరని శోకం అలముకుంది. సమాచారం తెలుసుకున్న స్థానికులు, బంధువులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఇంట్లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, వేడి నీళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీరేం విద్యార్థులు!.. స్కూల్‌కు సెలవు కోసం ఇంత పని చేస్తారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha