Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాలుగు ఆటోలను ఢీకొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

నాలుగు ఆటోలను ఢీకొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

వార్త 3 weeks ago

Delhi Road Accident: దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో శుక్రవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న పలు ఆటోరిక్షాలను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also : Greater Noida: పూలు కోద్దామని వెళ్లి.. అనంత లోకాలకు! కొడుకుని కాపాడబోయి తండ్రి కూడా మృతి

 Car rams into four auto-rickshaws; four people sustain serious injuries

Delhi Road Accident: ఆసుపత్రికి తరలింపు.. దర్యాప్తు వేగవంతం

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారు అదుపు తప్పడానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

చమోలీలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha