బాలికపై అఘాయిత్యం కేసులో నిందితుడికి మరణించే దాకా జీవిత ఖైదు
Hyderabad POCSO Case: మైనర్ల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు వేయించడంలో పోలీసులు మరోసారి విజయం సాధించారు.
సంజీవరెడ్డి నగర్ పరిధిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై లైంగిక దాడిచేసి ఆమె తల్లి కావడానికి కారకుడైన ఓ యువకుడికి నాంపల్లి 12వ అదనపు సెషన్స్ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరిం చింది. దీంతో పాటు సదరు నేరగాడు. బాధిత బాలికకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, పది వేల రూపాయల జరిమానా. కూడా క ట్టాలని తీర్పు చెప్పింది.
Read Also: Vijayawada Terror Case Investigation: ఉగ్ర లింకుల కేసు.. నిందితుల విచారణలో కీలక విషయాలు
Accused gets life imprisonment till death in girl rape case
Hyderabad POCSO Case: ఘటన నేపథ్యం, విచారణ
వివరాలు ఇలావున్నాయి. 2014 మే 11వ తేదీన ఎస్ఆర్ నగర్ లోని బికె గూడాకు చెందిన తొమ్మిదవ చదువుతున్న మైనర్ బాలిక కడుపునొప్పితో అమీర్పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఆ బాలిక గర్భవతిగా వున్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని గంటల తరువాత ఆ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. దీనిపై వైద్యులతో పాటు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు బాలికపై అఘాయిత్యా నికి పాల్పడ్డ నిందితుడు మడకారు శ్రీనివాసులు (24)పై ఫోక్సో కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈ కేసులో బాధిత బాలిక సెలవుల కోసం చుట్టాల ఇంటికి రాగా కర్నూలుకు చెందిన శ్రీనివాసులు ఉద్యోగం నిమిత్తం నగరానికి వచ్చి బికె గూడలో వుండసాగాడు. ఆ బాలికకు బంధువైన ఓ బాలుడితో ఆడుకునే నెపంతో తరచూ ఇంటికి వచ్చే శ్రీనివాసులు ఇదే సమయంలో బాలికపై లైంగికదాడికి పాల్పడి ఆమెను గర్భవతి చేశాడు.
న్యాయస్థానం వెలువరించిన కఠిన శిక్ష
ఆ బాలిక శిశువుకు జన్మనిచ్చిన తరువాత వైద్యుల సూచనల మేరకు పోలీసులకు నిందితుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. అనం తరం శ్రీనివాసులును అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు వేగంగా విచారణ చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై ఏడాదిన్నరకు పైగా వాదనలు జరిగాయి, ఈలోపు నిందితుడు శ్రీనివాసులు బెయిల్పై విడుదలయ్యాడు. దీనిపై సోమవారం నాడు నాంపల్లి 12వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి టి. అనిత తీర్పు వెలువరిస్తూ మైనర్ బాలికపట్ల అమానుషంగా ప్రవర్తించిన నిందితుడ శ్రీనివా సులుకు మరణించే వరకు జీవిత ఖైదు శిక్ష విధించారు.
పరిహారం, పోలీసుల అభినందన
దీంతో పాటు బాధిత బాలికకు పది లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. ఇదే కేసులో నిందితుడికి పది వేల రూపాయల జరిమానా కూడా. విధించారు. జరిమానా చెల్లించకుంటే ఆరు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి వుంటుందని జడ్జి తెలిపారు. తీర్పు వెలువడిన వెంటనే నిందితుడు శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా శ్రీనాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రామకృష్ణ, లీగల్ కౌన్సిలర్లుగా కల్పన, హేమ మీనన్ వ్యవ హరించారు. ఫోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడేలా చేసిన పోలీసు అధికారులను ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నిద్రిస్తున్న తల్లిని నిప్పు పెట్టి హతమార్చిన కిరాతక కుమారుడు

