LPG EKYC deadline:సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని పెట్రోలియం కంపెనీలు స్పష్టం చేశాయి.
ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రాయితీలు నిలిపివేయడంతో పాటు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలవుతాయి. సరైన సమయంలో ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో గ్యాస్ బుకింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ తంతు పూర్తి కాని వారు వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
Read also: Cabinet Meeting: పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం
Changing LPG rules
గ్యాస్ ఈ-కేవైసీ గడువు పూర్తి.. లేదంటే రాయితీ కోల్పోతారు
సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ పొందే ప్రతి వినియోగదారుడు ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అయింది. గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా చేయించుకోని వారు తీవ్ర నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయని వారికి రాయితీ పథకం నిలిచిపోతుంది. దీనివల్ల సాధారణ ధరల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా వేలిముద్రలు పడని వారు పడుతున్న ఇబ్బందులను గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. అయినప్పటికీ నిబంధనలు కఠినంగా మారడంతో వినియోగదారులు వెంటనే స్పందించి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
నాన్ ఈ-కేవైసీ వినియోగదారులకు మారుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు
నిర్దేశిత గడువులోగా ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేయని వారికి పెట్రోలియం కంపెనీలు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఈ-కేవైసీ లేనివారికి 14.2 కిలోల సిలిండర్లు నిలిపివేసి, కేవలం 5 కిలోల సిలిండర్ రూ.860 మరియు 10 కిలోల సిలిండర్ రూ.1760 ధరల చొప్పున సరఫరా చేయాలని యోచిస్తున్నాయి. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.994 లకే లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో 93 శాతం పూర్తవగా, మిగిలిన 7 శాతం అంటే 10.5 లక్షల మంది ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఏజెన్సీ సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఈ సేవలు అందిస్తున్నప్పటికీ పెండింగ్ లో ఉన్న వారు వెంటనే దగ్గరి గ్యాస్ ఆఫీసును సంప్రదించాలి.
LPG EKYC deadline:నిమిషంలో పూర్తి అయ్యే ఈ-కేవైసీ ప్రక్రియ ఎలా చేయాలి
గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి నేరుగా సంబంధిత ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఆధార్ కార్డు వివరాలతో పాటు మొబైల్ నంబర్ సరిచూసుకుని బయోమెట్రిక్ వేలిముద్ర లేదా కనుపాపల స్కాన్ ఇవ్వాలి. కేవలం నిమిషం వ్యవధిలో పూర్తయ్యే ఈ చిన్న ప్రక్రియ ద్వారా మీ సబ్సిడీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది. వృద్ధులకు ఎదురవుతున్న వేలిముద్రల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ప్రయోజనం పొందండి.
Epaper: epaper.vaartha.com

