Nani The Paradise Movie:నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా నాని ద ప్యారడైజ్ మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయాలని చిత్ర యూనిట్ మొదట భావించింది.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ తేదీకి సినిమా రావడం లేదని మూవీ టీం బయ్యర్లకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.
Read also: Actor surya political entry: రాజకీయాల్లోకి సూర్య వస్తున్నారా?
Nani The Paradise Movie latest update 2026
షూటింగ్ ఆలస్యం కావడానికి గల కారణాలు
గతంలో ఈ సినిమాను మార్చి 26న, ఆ తర్వాత జూన్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆగస్టు తేదీ కూడా మారడంతో ఈ సినిమా అక్టోబర్ లేదా డిసెంబర్ నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను రీ-షూట్ చేయడం, స్క్రిప్ట్ లో మార్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సమయం తీసుకుంటున్నారు.
Nani The Paradise Movie:హోల్డ్ లో పడ్డ బ్లడీ రోమియో సినిమా
ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల నాని తర్వాత చేయాల్సిన ప్రాజెక్టులపై ప్రభావం పడింది. ముఖ్యంగా నాని తదుపరి చిత్రం బ్లడీ రోమియో ప్రస్తుతం హోల్డ్ లో పడింది. ద ప్యారడైజ్ షూటింగ్ పూర్తిగా ముగిసిన తర్వాతే నాని తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు, కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

