Rajiv Gandhi Death Anniversary : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 35వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది.
తండ్రి జ్ఞాపకాలతో రాహుల్ గాంధీ భావోద్వేగం
రాహుల్ గాంధీ తన చిన్నప్పుడు తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.”నాన్నా.. మీరు కలగన్న నైపుణ్యవంతమైన, సుసంపన్నమైన, బలమైన భారతదేశ స్వప్నాన్ని సాకారం చేసే బాధ్యతను నేను పూర్తిగా నెరవేర్చుతాను. మీ బోధనలు, మీ విలువలు, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి.”
- రాహుల్ గాంధీ
తన రాజకీయ ప్రయాణంలో తండ్రి ఆలోచనలే తనకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
Read Also: PM Modi cabinet : మోదీ క్యాబినెట్ ప్రక్షాళన.. ఆ ఇద్దరు తెలుగు మంత్రులు అవుట్?
Rajiv Gandhi Death Anniversary
Rajiv Gandhi Death Anniversary : ఆధునిక భారత శిల్పి రాజీవ్: మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ ప్రధాని దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు. దేశంలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు టెలికాం, సమాచార సాంకేతిక (IT) రంగాలకు బలమైన పునాది వేశారు. “భారత్ ఒక పురాతన దేశం అయినా యువజాతి. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచే స్వయం సమృద్ధి భారతాన్ని నేను కలగంటున్నాను” అని నాడు రాజీవ్ అన్న మాటలను ఖర్గే ప్రస్తావించారు. హరియాణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ కూడా రాజీవ్‌ను ఆధునిక భారత శిల్పిగా అభివర్ణించారు.
వీర్ భూమిలో సోనియా, రాహుల్, ప్రియాంక నివాళులు
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి స్థలం ‘వీర్ భూమి’ వద్ద కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తమ కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ప్రియాంక పిల్లలు మిరాయా, రేహాన్ వాద్రాలతో పాటు సీనియర్ నేతలు పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
AI మంత్రిత్వ శాఖను ప్రారంభించిన కేరళం సర్కార్

