Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నార్నే నితిన్ కొత్త సినిమాప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లతో సందడి

నార్నే నితిన్ కొత్త సినిమాప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లతో సందడి

వార్త 3 weeks ago

Narne Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, టాలీవుడ్ యువ కథానాయకుడు నార్నే నితిన్ తన ఐదో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి తాత్కాలికంగా #NN5 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

హైదరాబాద్‌లో ఆదివారం నాడు ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

read also: Rowdy Janardhan : 'రౌడీ జనార్ధన' స్పెషల్ సాంగ్ లో అనన్య?

ఇద్దరు భామలతో రోమాన్స్ చేయనున్న నితిన్

ఒక ఆసక్తికరమైన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నార్నే నితిన్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘బుట్టబొమ్మ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనిఖా సురేంద్రన్‌తో పాటు కన్నడ నటి మేఘా శెట్టి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.

Narne Nithin: క్రేజీ టెక్నీషియన్లతో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ప్లాన్

చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధా కృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ పెద్ద అసెట్ అని చెప్పాలి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి విజువల్ వండర్స్‌కు కెమెరామెన్‌గా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి విజువల్స్ అందించబోతున్నారు. వివేక్-మెర్విన్ ద్వయం సంగీత బాధ్యతలను స్వీకరించారు.

ఘనంగా పూజా కార్యక్రమాలు.. క్లాప్ కొట్టిన మేకర్స్

హైదరాబాద్‌లో జరిగిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత వెంకట్ కె. నారాయణ క్లాప్ కొట్టగా, కెమెరామన్ సెంథిల్ కుమార్ స్వయంగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన నేపథ్యంలో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను, రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్‌ను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

ముచ్చటగా మూడోసారి ఆమిర్ ఖాన్ పెళ్లి..ప్రియురాలు గౌరీతో రిజిస్టర్ మ్యారేజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha