ప్రముఖ సినీ గాయని మంగ్లీ (Mangli) మరియు న్యాయవాది సుభా సింగబోష్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు చేరింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే, ఆమె తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ ను, ఆశ్రయించడం సంచలనంగా మారింది.
Read Also: Rajinikanth bomb threat : రజినీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబులు పెట్టినట్లు బెదిరింపు
రూ.150 కోట్లకు మోసం చేశారంటూ తనపై సుభా సింగబోష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని, అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని ఆమె వెల్లడించారు. తనను కలవాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరించారని ఆరోపించారు.
తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించారని, మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. సుభా సింగబోష్ తీరుపై తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మంగ్లీ. దీంతో సుభా సింగబోష్‌పై కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
Singer Mangli Fraud Case
Singer Mangli: ఇంతకీ ఏంటీ వివాదం..?
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి రూ.కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగాబాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

