Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాసిక్ టీసీఎస్ కేసు.. 25 రోజుల తర్వాత నిదా ఖాన్ పట్టివేత

నాసిక్ టీసీఎస్ కేసు.. 25 రోజుల తర్వాత నిదా ఖాన్ పట్టివేత

వార్త 3 months ago

TCS Nashik case : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిళ్లు, వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

గత 25 రోజులుగా పరారీలో ఉన్న ఆమెను గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులపై మతపరమైన ఒత్తిడి, వేధింపులు జరిగాయన్న ఆరోపణలతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించారు.

దర్యాప్తులో భాగంగా నిదా ఖాన్‌పై కీలక ఆరోపణలు బయటపడ్డాయి. ఆమె కంపెనీలో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై మతపరమైన ఆచారాలు పాటించాలని, ప్రత్యేక దుస్తులు ధరించాలని బలవంతం చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

 TCS Nashik case

ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం నాసిక్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆమె పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

చివరకు గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆమె జాడను గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

త్వరలో స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha