Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

త్వరలో స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

వార్త 3 months ago

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం స్పష్టత

AP Local Elections : సీఎం చంద్రబాబు రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అమరావతి లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన 'స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలు' అంశంపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై ఫోకస్

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం చాలా ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.64 వేల కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. మరో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.

Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!

 AP Local Elections

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం

ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని సీఎం కలెక్టర్లను హెచ్చరించారు. వర్షాధార పంటలు, ఉద్యాన పంటలు, మెట్ట ప్రాంతాలకు అనుగుణంగా ముందస్తు నీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదే సమయంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎన్నికల్లో ధనస్వామ్యం ఓడి ప్రజాస్వామ్యం గెలిచింది - విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha