Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాసిక్ టు రాజస్థాన్.. ప్రశ్నపత్రం లీకేజీ వెనుక అసలు కథ!

నాసిక్ టు రాజస్థాన్.. ప్రశ్నపత్రం లీకేజీ వెనుక అసలు కథ!

వార్త 3 months ago

NEET UG 2026 Cancelled: వైద్య విద్య ప్రవేశ పరీక్ష 'నీట్ యూజీ 2026' ప్రశ్నపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

మహారాష్ట్రలోని నాసిక్‌లో మొదలైన ఈ లీకేజీ వ్యవహారం, అనతికాలంలోనే పలు రాష్ట్రాలకు పాకినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నాసిక్‌కు చెందిన బీఏఎంఎస్ విద్యార్థి శుభం ఖైర్నార్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. పుణేలో రూ. 10 లక్షలకు పేపర్‌ను కొనుగోలు చేసిన శుభం, దానిని మరో వ్యక్తికి రూ. 15 లక్షలకు విక్రయించి లాభపడ్డాడని అధికారులు తెలిపారు. పోలీసుల కళ్లుగప్పేందుకు తన జుట్టు కత్తిరించుకుని రూపు మార్చుకున్నప్పటికీ, టెక్నికల్ నిఘా ద్వారా అధికారులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

Read Also:Bandi Bhagirath Case Updates: విచారణకి హాజరుకాని POCSO కేసు నిందితుడు బండి భగీరథ్

NEET UG 2026 Cancelled: నీట్ లీకేజీ కింగ్‌పిన్ శుభం ఖైర్నార్ అరెస్ట్

ఈ లీకేజీ అత్యంత హైటెక్ పద్ధతిలో సాగడం గమనార్హం. నిందితులు పోర్టబుల్ స్కానర్లు, టెలిగ్రామ్ నెట్‌వర్క్ మరియు షాడో సర్వర్లను ఉపయోగించి పరీక్షకు 45 గంటల ముందే ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చారు. సికార్‌కు చెందిన ఒక విద్యార్థి తన తండ్రికి పంపిన “గెస్ పేపర్” పీడీఎఫ్‌లో ప్రశ్నలు, అసలు పేపర్‌తో సరిపోలడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసింది. సుదీర్ఘకాలం కష్టపడి పరీక్ష రాసిన విద్యార్థులు, ఈ రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నీట్-యూజీ 2026 పేపర్ లీక్: నాసిక్‌లో బీఏఎంఎస్ విద్యార్థి అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha