Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విచారణకి హాజరుకాని POCSO కేసు నిందితుడు బండి భగీరథ్

విచారణకి హాజరుకాని POCSO కేసు నిందితుడు బండి భగీరథ్

వార్త 3 months ago

Bandi Bhagirath Case Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ పోక్సో (POCSO) కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేసి, ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

అయితే, పోలీసుల నోటీసులను బేఖాతరు చేస్తూ ఆయన విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. గతంలో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో నమోదైన ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన భగీరథ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also:Bandi Bhagirath Missing Posters: బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

Bandi Bhagirath Case Updates: పోలీస్ స్టేషన్‌లో విచారణ అధికారులూ లేరు!

మరోవైపు, ఈ విచారణ ప్రక్రియలో పోలీసుల తీరు కూడా వివాదాస్పదమవుతోంది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చి నిందితుడి కోసం వేచి చూడాల్సిన అధికారులు, తీరా సమయానికి స్టేషన్‌లో అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్న విచారణాధికారి రితిరాజ్ సహా ఇతర కీలక అధికారులు ఎవరూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు నిందితుడు రాకపోవడం, మరోవైపు అధికారులే స్టేషన్‌లో లేకపోవడంతో ఈరోజు జరగాల్సిన విచారణ ప్రక్రియ ముందుకు సాగలేదు. అధికారుల గైర్హాజరు వెనుక కారణాలేంటో తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హనుమాన్ సాక్షిగా ప్రమాణం చెయ్.. బండి సంజయ్‌కు RS ప్రవీణ్ కుమార్ సవాల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha