Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్వాస ఆడకనే మాజీ ఐపిఎస్ సతీమణి మృతి

శ్వాస ఆడకనే మాజీ ఐపిఎస్ సతీమణి మృతి

వార్త 2 weeks ago

Former IPS Wife Death Case: మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే సతీమణి తనూజ రంజన్(62) శ్వాస ఆడకనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితులు నోట్టో గుడ్డలు కుక్కడంతో శ్వాస ఆడక(అసి పిక్సియా) మృతిచెందిందని వైద్యులు ప్రాథమికంగా అందించిన శవపంచానామాలో తేల్చారు.

నోట్లో రక్తంతో తడిసిన గుడ్డ, మణికట్టుపై బంధించిన గుర్తులు, నాలుక కొనపై కొరికిన గాయాలు ఉన్నట్లు ఆయా నివేదికలో వైద్యులు నిర్ధారించారు. ఆమె కాళ్లు, చేతులు బంధించి, నోట్లో గుడ్డలు కుక్కడం వల్ల ఊపిరి ఆడకపోవడం, భయంతో ఆమె మృతిచెందినట్లు దృవీక రించారు. ఇవే అంశాలను వైద్యులు శవపంచానామాలో ప్రాథమికంగా తెలిపారని జూబ్లీహిల్స్ డివిజన్ ఇంచార్జి ఎసిపి సామల వెంకటరెడ్డి తెలిపారు.

Read Also: PA Murder Case: సువేందు అధికారి పీఏ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

 Tanuja Ranjan died due to suffocation.

Former IPS Wife Death Case: దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు

మరోవైపు హత్య, దోపిడి అనంతరం దుండగులు పారిపోయే సమయంలో సెల్ఫోన్లు పారేసి పోయారనేది అవాస్తవమన్నారు. కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు బృందాలుగా అన్ని దిక్కుల్లో వెదుకుతున్నారు. నిందితులకు చిక్కిన సమయం సంఘటన జరిగిన రోజున గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.38 గంటలకు ముగ్గురు అగంతకులు వినయ్ రంజన్ రే నివాసంలోకి దేతిలో ఇనుప రాడ్లు, ముఖానికి నల్లని మాస్కులు ధరించి ప్రవేశించా రు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విశ్లేషణ

అనంతరం దాదాపు గంట 20 నిమిషాల తరువాత అంటే 2.58 గంటలకు ముందు కల్పన ఒక సంచితో, వెనుక ఉన్న ముగ్గురిలో చివరి వ్యక్తి మరో సంచితో వెనుకవైపు నుంచి వెళ్లినట్లు ఇప్పటికే పోలీసులకు లభించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. తనూజ రంజనను బంధించడం, ఇంట్లోని బీరువాలను, లాకర్లను పగులగొట్టేందుకు విఫల యత్నం చేశారు. దీనికితోడు తనూజ రంజన్ చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు, మెడలోని పుస్తెలతాడు, మరో బంగారు గొలుసు చెవి పోగులు తీసుకోవడానికి వారికి సమయం అధికారి తెలిపారు. పట్టి ఉంటుందని నేరస్థలాన్ని పరిశీలించిన ఒక పోలీసు తనూజ అర్ధరాత్రి 2 గంటల తర్వాత మృతి చెందగా ఉదయం 10 గంటల వరకు ఈ విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించలేక పోయారు. ఇంట్లో జరిగిన సంఘటనను గుర్తించడానికి దాదాపు 8 గంటల సమయం పట్టింది.

నిందితుల కోసం గాలింపు చర్యలు

వారు అనుకున్న ప్రాంతానికి అనుకున్నట్లుగా వెళ్లడమే కాకుండా నగరాన్ని వదిలి వెళ్లిపోవడానికి అవకాశం చిక్కినట్లైంది. నిందితులు ఆటోలో నాంపల్లికి అక్కడి నుంచి రైలులో నాగపూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. నిందితులు ఎక్కడికి వెళ్తారనే అంశంపై పోలీసులు లోతుగా దృష్టి పెట్టారు. ముంబైలో ఆశ్రయం ఇచ్చేవారిపై ఇప్పటికే దృష్టి పెట్టారు. అలాగే అక్కడి నుంచి చాలా వరకు నేరస్థులు బీహార్ ను దాటుకొని జానకీపూర్కు వెళ్తారని, అక్కడ బంగారం కరిగించే అనేక పరిశ్రమలు ఉన్నాయని, బంగారాన్ని అక్కడ కరిగించి అనంతరం అక్కడి నుంచి హద్దులు దాటి నిందితులు తమ సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉందని ఇదే తరహా నేరపరిశోధనలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి తెలిపారు.

నిందితులను సరిహద్దు దాటకముందే పట్టుకోవాలని పోలీసు శాఖ భావించి అందుకు తగిన విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కల్పనతోపాటు ఉన్న నిందితులను సైతం పోలీసులు గుర్తించారు. కల్పనతోపాటు సురేష్ సాయి అనే నిందితుడు, మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. నలుగురి జాడను గుర్తించేందుకు సాంకేతికంగా అన్ని ప్రయ త్నాలు చేస్తున్నామని ఒక దర్యాప్తు అధికారి వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పారిపోయిన నిందితులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha