Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నమ్మించి.. భయపెట్టి 9వ తరగతి బాలికపై అత్యాచారం.. నలుగురిపై పోక్సో కేసు

నమ్మించి.. భయపెట్టి 9వ తరగతి బాలికపై అత్యాచారం.. నలుగురిపై పోక్సో కేసు

వార్త 3 months ago

West godavari crime: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరు. నలుగురిలో అల్లరి చేస్తామని బెదిరించి మరో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఒక పక్క ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి మైనర్ బాలికల వరకూ ఎంతోమంది బాలికలు మృగాల చేతుల్లో బలైపోతున్నారు. చట్టం తీసుకువచ్చి అరెస్టు చేసి జైలుకు తరలించడం తప్ప కామాందులు భయపడేలా శిక్షలు పడకపోవడంతో ఈ ఘాతుకాలకు అంతమన్నది లేకుండా పోతోంది.

Read also: Atchannaidu: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచే కాలువల్లోకి సాగునీరు విడుదల!

 9th Grade Girl Raped After Being Intimidated

West godavari crime: స్నేహితుల బెదిరింపులు అఘాయిత్యాలు

వివరాల్లో కెళితే విస్సా కోడేరు గ్రామానికి చెందిన తొమ్మిదవ తర గతి విద్యార్థిని ఒక యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, భయపెట్టి మరో ఇద్దరు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ ముగ్గురి తోపాటు మరొకరి పైన పోక్సో కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పాలకోడేరు మండలానికి చెందిన ఒక బాలిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకట గణేష్ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2024 నుంచి పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఇదే అదునుగా గణేష్ స్నేహితుడు దుర్గ మహేష్ (బాబి) బాలికను బలవంతంగా లోబరుచుకున్నాడు.

పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతిగా

ఇదే గ్రామానికి చెందిన భోగేశ్వరరావు కూడా ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను భయపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గొరగనుమూడి గ్రామo ఈనెల 9న రైల్వే గేటు సమీపంలో సపోటా తోటలోకి బాలికను బలవంతంగా లాక్కొనివెళ్లి బలాత్కారం చేయడానికి ప్రయత్నంచగా ఆమె పారిపోయి ఇంటికి చేరింది. బాలిక ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు రావడంతో ఈ నెల 15న భీమవరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతిగా వైద్యులు తేల్చారు. దీంతో బాలికను నిలదీయడంతో ఈ దారుణం బయటపడింది. ఆమె తల్లి దండ్రుల ఫిర్యాదు ఆధారంగా విచారణ నిర్వ హించి నలుగురిపై పోక్సో చట్టంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్ఐ రవి వర్మ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

3 రోజులు వర్ష సూచన.. తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha