Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నన్ను అరెస్ట్ చేసుకోండి, బెయిల్ అడగను..ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్!

నన్ను అరెస్ట్ చేసుకోండి, బెయిల్ అడగను..ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్!

వార్త 3 months ago

Professor Nageshwar Comments: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నమోదైన కేసుల విషయంలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.

నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని, అయితే తాను అరెస్ట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టపరమైన రక్షణల కోసం తాను ఎలాంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయబోనని తేల్చి చెప్పారు.

Read Also :Pawan Kalyan : ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ రియాక్షన్

 Kakinada Indrapalem Police Case

“నాపై ఏపీలో కేసులు నమోదు చేశారు. ఆ మరుసటి రోజే నన్ను అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం అందింది. నేను ఎక్కడికీ పారిపోను, హైదరాబాద్‌లోని నా ఇంట్లోనే ఉంటాను, ధైర్యంగా అరెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకు నేను ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పిటిషన్ వేయలేదు, భవిష్యత్తులోనూ వేయను. కేసు కొట్టేయాలని కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. నేను దేనికైనా సిద్ధం” అని ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్ విసిరారు.

జైలు జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు

తన సుదీర్ఘ ప్రజా జీవితంలో అనేక రంగాలలో తనకు అనుభవాలు ఉన్నాయని, జైలు జీవితం అనే అనుభవం ఒక్కటే మిగిలి ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. “నాకు విద్యార్థి ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, చట్టసభలు (ఎమ్మెల్సీగా), మీడియా రంగంలో పనిచేసిన పూర్తి అనుభవాలు ఉన్నాయి. కేవలం జైలు జీవితం అనుభవం మాత్రమే లేదు. ఒకవేళ అది కూడా వస్తే, నా ఆత్మకథ (Autobiography) రాసుకోవడానికి అదొక పరిపూర్ణమైన అధ్యాయం అవుతుంది” అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.

Professor Nageshwar Comments: వివాదం నేపథ్యం ఇదీ

ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా నిరాకరించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాకినాడ సహా ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తీవ్ర విమర్శలు రావడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పారు. అటు రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తాను ఎవరినీ జైల్లో పెట్టమని అమిత్ షాను అడగలేదని, వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. అయితే, నాగేశ్వర్ క్షమాపణలు చెప్పినప్పటికీ కేసులు వెనక్కి తీసుకోకపోవడం, అరెస్ట్ వార్తలు రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జనసేన లో శత్రువులు ఉన్నారు..బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha