Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ రియాక్షన్

ప్రొ. నాగేశ్వర్ కామెంట్స్ వివాదంపై పవన్ రియాక్షన్

వార్త 3 weeks ago

Pawan Kalyan Slams Professor Nageshwar : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న విశ్లేషణలు, ఒక ప్రముఖ విశ్లేషకుడితో నడుస్తున్న వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా, అత్యంత తీవ్రస్థాయిలో స్పందించారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ తన ఆగ్రహాన్ని బహిర్గతం చేశారు. “దారినపోయేవాళ్లు జనసేన పార్టీపై ఇష్టానుసారం రాళ్లు వేస్తామంటే ఇకపై చూస్తూ ఊరుకోనని” ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వ్యక్తిగత విమర్శలను, దూషణలను భరించానని.. కానీ ఇకపై భరించే ఓపిక తనకు లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తప్పుగా మాట్లాడేవారిని ‘కర్మ’ అనేది ఎవరినీ వదిలిపెట్టదని, కాలమే అందరికీ సమాధానం చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also : ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేల కూతుళ్ల హవా!

ప్రశ్నిస్తే కులం కార్డు తెస్తారా?.. హెచ్చరించిన జనసేనాని

ఈ సందర్భంగా విమర్శలు చేసే విశ్లేషకుల తీరును తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తారు. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల్లో ఇష్టానుసారంగా మాట్లాడేవారిని, విశ్లేషణల పేరిట బురదజల్లేవారిని తాము వెనక్కి ప్రశ్నిస్తే.. వెంటనే ‘కులం కార్డు’ను ముందుకు తీసుకురావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎదుటివారు ఏది మాట్లాడినా తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా? తమకు కోపం రాదా? అని పవన్ ప్రశ్నించారు. శృతిమించుతున్న విమర్శల పట్ల “మితిమీరిన సహనం ప్రదర్శిస్తే.. దానిని అవతలివారు చేతగానితనంగా భావిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉండాలని, ఇకపై పరిధులు దాటి మాట్లాడితే సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు - పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha