Dailyhunt
"నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి" అంటూ ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ కౌంటర్

"నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి" అంటూ ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ కౌంటర్

వార్త 2 weeks ago

Trump 48-hour ultimatum to Iran: పశ్చిమాసియాలో యుద్ధం ఆరో వారానికి చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు జారీ చేసిన 48 గంటల అల్టిమేటం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవాలని లేదా శాంతి ఒప్పందానికి రావాలని, లేనిపక్షంలో ఇరాన్ మౌలిక సదుపాయాలపై భయంకరమైన దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సైనిక నాయకత్వం స్పందించింది.

Read Also: Iran-America War: వచ్చే మూడు వారాల్లో ఇరాన్‌పై తీవ్రమైన దాడులు..

ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. “శాంతి ఒప్పందం కుదుర్చుకుని, కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌కు నరకం చూపిస్తాం” అని హెచ్చరించారు. గతంలో మార్చి 26న ఇచ్చిన 10 రోజుల గడువు ఈ నెల 6తో ముగియనుండగా, ట్రంప్ ఈ తాజా అల్టిమేటం జారీ చేశారు.

 US-Iran War

Trump 48-hour ultimatum to Iran: ఇరాన్ ఘాటు స్పందన: “నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి”

ఇరాన్ ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి జనరల్ అలీ అబ్దుల్లాహి అలీబాదీ మాట్లాడుతూ.. అమెరికా గనుక దుస్సాహసానికి ఒడిగడితే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “ఒకవేళ మా దేశ ఆస్తులపై దాడులు జరిగితే.. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపై నిరంతరాయంగా విధ్వంసకర దాడులు చేస్తాం.

అదే జరిగితే మీకు నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి” అని ఆయన హెచ్చరించారు. వరుస సైనిక వైఫల్యాల వల్ల కలిగిన నిరాశతోనే ట్రంప్ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.అలాగే దేశ హక్కులను కాపాడటానికి, జాతీయ ఆస్తులను రక్షించడానికి ఇరాన్ సాయుధ దళాలు ఒక్క క్షణం కూడా వెనుకాడబోవని, దురాక్రమణదారులకు తగిన బుద్ధి చెబుతాయని అలీ అబ్దుల్లాహి అలీబాదీ వివరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం: 48 గంటల్లో ప్రళయం తప్పదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha