Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నర్సీపట్నంలో పోలీసుల మెరుపు దాడి.. రూ. 50 లక్షల గంజాయి స్వాధీనం!

నర్సీపట్నంలో పోలీసుల మెరుపు దాడి.. రూ. 50 లక్షల గంజాయి స్వాధీనం!

వార్త 1 month ago

Anakapalli Ganja Busted: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్‌ను భగ్నం చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని పోలీసు బృందం కేడీపేట సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది.

Read Also: CI Chinna Mallaiah Rape Case: మాజీ సీఐపై అత్యాచారం కేసు!

 Anakapalli Ganja Busted: Police raid in Narsipatnam.. Rs. 50 lakhs worth of ganja seized!

రూ. 50 లక్షల గంజాయి స్వాధీనం

ఒడిశా రాష్ట్రం నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ మార్కెట్‌లో సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంజాయితో పాటు స్మగ్లింగ్‌కు ఉపయోగించిన ఒక కారు, మూడు బైకులు, ఐదు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు

ఈ స్మగ్లింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు:

  1. తేజ్ కిరణ్
  2. చందు
  3. సింహాద్రి
  4. అరవింద్
  5. విగ్నేష్

ఉక్కుపాదం మోపుతాం: పోలీసుల హెచ్చరిక

నిందితులపై కేసు నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha