Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవోడలో TMC - AJUP మధ్య ఘర్షణ.. రంగంలోకి పోలీసులు

నవోడలో TMC - AJUP మధ్య ఘర్షణ.. రంగంలోకి పోలీసులు

వార్త 2 months ago

West Bengal Polls: పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికల (ఏప్రిల్ 23, 2026) సందడిలో భాగంగా ముర్షిదాబాద్ జిల్లాలోని నవోడ నియోజకవర్గం తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది.

అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) కార్యకర్తల మధ్య జరిగిన దాడులు స్థానికంగా కలకలం రేపాయి.

Read Also:Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

West Bengal Polls: అసలు ఏం జరిగింది?

ఘర్షణకు ప్రధాన కారణం AJUP చీఫ్ హుమాయూన్ కబీర్ పర్యటన. ఆయన ఓటు వేసిన తర్వాత శివనగర్ గ్రామంలోని ఒక పోలింగ్ బూత్‌ను సందర్శించడానికి వెళ్లగా, అక్కడ ఉద్రిక్తత మొదలైంది.కబీర్ రాకను నిరసిస్తూ TMC కార్యకర్తలు 'గో బ్యాక్' నినాదాలు చేశారు. ఆయనను "బీజేపీ ఏజెంట్" అని పిలవడంతో వివాదం ముదిరింది.TMC కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు లంచాలు ఆఫర్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ అక్కడే బైఠాయించారు.వాగ్వాదం కాస్తా పెరిగి ఇరు వర్గాలు, వాళ్లు, రాళ్లు, ఇటుకలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

పోలీసుల చర్య & ప్రస్తుత పరిస్థితి

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఎన్నికల కమిషన్ (ECI) అధికారులను ఆదేశించింది.పశ్చిమ బెంగాల్‌లోని 152 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. నవోడ మినహా మిగిలిన చోట్ల పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే సాగుతోంది.

తదుపరి షెడ్యూల్

  • రెండో దశ పోలింగ్: ఏప్రిల్ 29, 2026
  • ఫలితాల విడుదల: మే 4, 2026

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఓటు వేస్తూ వీడియో తీసిన టీవీకే కార్యకర్త అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha