Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపత్తూరు జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఒక రాజకీయ కార్యకర్త ఏకంగా జైలు పాలయ్యాడు.
బూత్ లోపల సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో పోస్ట్
తిరుపత్తూరు జిల్లాకు చెందిన శక్తి ప్రభా అనే వ్యక్తి, తాను అభిమానించే టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీకి ఓటు వేస్తూ సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం సీసీటీవీ నిఘా ద్వారా అధికారుల దృష్టికి వెళ్ళింది. ఓటింగ్ గోప్యతను పాటించకుండా, పోలింగ్ కేంద్రం లోపల నిబంధనలకు విరుద్ధంగా వీడియో తీయడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.
ఎన్నికల అధికారుల ఫిర్యాదు.. అరెస్ట్
ఎన్నికల అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శక్తి ప్రభాను వెంటనే అరెస్ట్ చేశారు. పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లలోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడం కానీ, ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరించడం కానీ చట్టరీత్యా నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇది ఓటు గోప్యతను ఉల్లంఘించడమేనని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం మరోసారి హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

