Sonam Wangchuk: నీట్ (NEET) పరీక్ష వివాదంలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ, సుదీర్ఘంగా 26 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) నేడు (సోమవారం) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.
Read Also: Remove Reservation : భారత్ లో మరో ఉద్యోమం
Sonam Wangchuk to be discharged from the hospital today!
Sonam Wangchuk: 26 రోజుల నిరాహార దీక్ష
నీట్ నిరసనకారులకు మద్దతుగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ ఏకధాటిగా 26 రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రావడం, సీజేపీతో పాటు విద్యార్థులు తమ ఆందోళనను విరమించడంతో శుక్రవారం ఆయన కూడా తన దీక్షకు ముగింపు పలికారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో, సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతించారు.
రాజ్‌ఘాట్ నివాళి, లద్దాఖ్ ప్రయాణం
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన నేరుగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, సత్యగ్రహ పద్ధతిలో సాగిన తన పోరాటానికి శాంతియుత ముగింపు ఇస్తారని ఆయన ప్రతినిధి బృందం తెలిపింది. రాజ్‌ఘాట్ సందర్శన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ తన సొంత ప్రాంతమైన లద్దాఖ్‌కు తిరుగు ప్రయాణమవుతారని వారు స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

