Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి

వార్త 2 weeks ago

NTR Statue Unveiling: తెలుగు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం కొలువుదీరింది. అమీర్‌పేటలోని అత్యంత ప్రముఖమైన మైత్రీవనం చౌరస్తాలో నూతనంగా నిర్మించిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (గురువారం) అధికారికంగా ఆవిష్కరించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

 ntr statue at maithrivanam ameerpet

Read also: NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

శిల్పి రాజ్‌కుమార్ ఉడయార్ అద్భుత సృష్టి.. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలనే లక్షలాది మంది అభిమానుల దశాబ్దాల నాటి కల సాకారమవ్వడం వెనుక స్థానిక శాసనసభ్యుడు నవీన్ యాదవ్ ప్రత్యేక కృషి, చొరవ ఎంతో ఉన్నాయి. అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ శిల్పి డి. రాజ్‌కుమార్ ఉడయార్ దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ అద్భుతమైన కాంస్య విగ్రహానికి సజీవ రూపాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌లు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు.

NTR Statue Unveiling: వాహనదారులకు అలర్ట్: మైత్రీవనం పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు

విగ్రహావిష్కరణ సభ మరియు భారీ జనసందోహం రానున్న నేపథ్యంలో మైత్రీవనం, అమీర్‌పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నేటి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:

జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వారు, అమీర్‌పేట, సత్యం థియేటర్, ఎస్‌ఆర్ నగర్ వైపు నుండి జూబ్లీ చెక్‌పోస్ట్‌కు వెళ్లే వాహనాలను వెంగళరావునగర్, కల్యాణ్‌నగర్ మీదుగా మళ్లిస్తారు. సత్యం థియేటర్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు పంజాగుట్ట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. యూసుఫ్‌గూడ నుండి మైత్రీవనం వైపు వచ్చే వాహనాలను కృష్ణకాంత్ పార్క్ వైపునకు, అలాగే యూసుఫ్‌గూడ బస్తీ నుండి వచ్చే ట్రాఫిక్‌ను వెంగళరావునగర్ వైపునకు మళ్లిస్తారు.

ఈ సమయంలో అమీర్‌పేట మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేవారు ట్రాఫిక్ పోలీసుల సూచనలను గమనించి, సహకరించాలని కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

రీయూజబుల్ రాకెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha