Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెహ్రూతో మోదీని పోల్చడం పై శరద్ పవార్ విమర్శలు

నెహ్రూతో మోదీని పోల్చడం పై శరద్ పవార్ విమర్శలు

వార్త 3 days ago

Modi : భారత రాజకీయాల్లో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన 'ఎన్నికైన ప్రధాని' (Elected PM) గా నరేంద్ర మోదీ, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో, నెహ్రూతో ప్రధాని మోదీని పోల్చడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత, సీనియర్ రాజకీయ ధురంధరుడు శరద్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం పదవిలో ఉన్న రోజుల లెక్కలను బట్టి ఇద్దరు భిన్నమైన నేతలను ఒకే త్రాటిపైకి తీసుకురావడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన త్యాగాలు, సేవలు అనన్యసామాన్యమైనవని.. వాటిని కేవలం అధికార కాలంతో కొలవలేమని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

Read Also : 'మీనాక్షి' నామినేషన్‌ తిరస్కరణ..తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి

నెహ్రూ సేవలను మరువలేమన్న ఎన్సీపీ బాస్!

పార్టీ అంతర్గత కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. పండిట్ నెహ్రూ చారిత్రాత్మక నేపథ్యాన్ని గుర్తు చేశారు. “దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నెహ్రూ గారు ఎన్నో ఏళ్ల పాటు కఠినమైన జైలు జీవితాన్ని గడిపారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప మహానాయకుడు ఆయన. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని ఎత్తు నిలిపిన ఘనత నెహ్రూది. అటువంటి త్యాగధనుడితో నేటి ప్రధాని మోదీని ఎలా పోల్చగలరు?” అని ఆయన ప్రశ్నించారు. ఆధునిక భారతదేశ పునాదులు వేసిన వ్యక్తిగా నెహ్రూ సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని, కేవలం రికార్డుల కోసం ఇద్దరినీ పోల్చడం తగదని పవార్ విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాలనలో నెహ్రూను దాటిన మోడీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha