Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పోస్ట్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
‘అలోన్’ (Alone), ‘లోన్లీ'(Lonely) మధ్య తేడాను వివరించిన ఆయన సందేశం క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తాజాగా స్వయంగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : Mega158 Movie Updates: మెగా158 మూవీలోకి 'జైలర్' సినిమాటోగ్రాఫర్ ఎంపిక
Salman Khan’s clarification on viral post!
ఇటీవల సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షర్ట్‌లెస్ ఫోటోతో పాటు ఒక మెసేజ్ షేర్ చేశారు. “ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి… ఒకటి ‘అలోన్’, రెండోది ‘లోన్లీ'” అంటూ ఆయన రాసిన ఈ వాక్యాలు నెటిజన్లను ఆలోచింపజేశాయి. చాలా మందిలో అనుమానాలు రేకెత్తించాయి. ముఖ్యంగా “ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్” అనే లైన్ అభిమానులను కంగారుపెట్టింది. దీంతో సల్మాన్ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉందా? ఆయన నిజంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
Salman Khan: ఇంతకీ ఏమన్నారంటే?
‘నేను నా గురించి ఆ పోస్ట్ పెట్టలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. చాలా మంది స్నేహితులు ఉన్నారు. అభిమానుల ప్రేమ నాకు తోడుగా ఉంటుంది. నేను లోన్లీ కాదు’ అని ఆయన తెలిపారు. కొన్నిసార్లు నిరంతరం జనాల్లో ఉండటం వల్ల అలసటగా అనిపించి, తన కోసం కొంత సమయం కావాలనిపిస్తుందని, అదే భావంతో ఆ పోస్ట్ పెట్టానని సల్మాన్ ఖాన్ స్పష్టత ఇచ్చారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులే కంగారుపడ్డారు. “మీరు అంతగా హైలైట్ చేయడంతో మా అమ్మ కూడా ‘ఏమైంది?’ అని అడిగింది” అని సల్మాన్ వివరించారు. “చిల్ అవ్వండి… అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు” అంటూ సరదాగా స్పందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్.. కృతి సనన్‌ను అలా అనేసిందేంటి?

