Kakinada Crime : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం శ్రద్ధావరం గ్రామానికి చెందిన సూలు వీర వెంకటరామ త్రిమూర్తి సత్యేంద్రసతీష్ (32) అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
కరప మండలం అరట్లకట్టలో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న సతీష్, స్థానికంగా ఒక నెట్ సెంటర్ నిర్వహిస్తూ ఒక బ్యాంకుకు బ్యాంకింగ్ కరస్పాండెంట్ (BC)గా సేవలు అందించేవాడు. ఆదివారం తన భార్య స్వాతి రోజా, కుమార్తెను ఇంద్రపాలెంలోని అత్తగారింట్లో దింపిన అనంతరం అరట్లకట్టలోని తన నివాసానికి చేరుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
Kurnool Lightning Strike: పొలంలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
Kakinada Crime
Kakinada Crime : సెల్ఫీ వీడియోలోని కీలక ఆరోపణలు & మోసం
ఆత్మహత్యకు ముందు సత్యేంద్రసతీష్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. తన చావుకు బ్యాంక్ సిబ్బంది, స్థానిక డ్వాక్రా యానిమేటరే కారణమని అందులో ఆరోపించాడు. డ్వాక్రా గ్రూపుల మహిళల రుణ వాయిదాల సొమ్ము సేకరించే యానిమేటర్, సభ్యుల ఆధార్ నంబర్లు ఇవ్వకపోవడంతో సతీష్ తన సొంత ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఆ మొత్తాన్ని జమ చేసేవాడు. యానిమేటర్ తీసుకొచ్చే డిపాజిట్ సొమ్ములో భారీగా తేడాలు, అవకతవకలు వస్తుండటంతో అనుమానం వచ్చి తాను ఆ ఉద్యోగం నుంచి తప్పుకుంటానని చెప్పాడు. సతీష్ తప్పుకుంటానని చెప్పడంతో యానిమేటర్, సంబంధిత బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కై ఆ అక్రమాలన్నింటినీ సతీష్ పైనే తోసేశారని, తాను ఎలాంటి మోసం చేయలేదని, చనిపోయాకైనా నమ్మాలని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న కరప పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సతీష్ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రి (GGH)కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సతీష్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సదరు డ్వాక్రా యానిమేటర్ మరియు బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారణ వేగవంతం చేశారు.
ఐఐటీ-బాంబేలో విద్యార్థి ఆత్మహత్య..ప్రొఫెసర్ పై తీవ్ర ఆరోపణలు

