Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్.. దోచుకున్న 29 మంది అరెస్ట్!

నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్.. దోచుకున్న 29 మంది అరెస్ట్!

వార్త 3 weeks ago

Nepal Floods: నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భయంకరమైన ఆకస్మిక వరదల వేళ వరద ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను బలవంతంగా పగలగొట్టి, అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించిన ఆరోపణలపై పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి రూ. 92,68,505 నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ. 57 లక్షలు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also : Nepal Floods : గిరాంగ్ పోర్ట్ షాకింగ్ వీడియోపై చైనా నిషేధం

 Bank locker washed up in Nepal floods: 29 people arrested for looting it!

Nepal Floods: త్రిశూలి నది సమీపంలో దొరికిన లాకర్

పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. ఆ లాకర్ ధాడింగ్ జిల్లా పరిధిలోని త్రిశూలి నది సమీపంలో స్థానికులకు కనిపించింది. అయితే, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాల్సింది పోయి, లాకర్‌ను బలవంతంగా తెరిచి అందులోని నగదును పంచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే రంగంలోకి దిగిన నేపాల్ ఏఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, పోలీసుల ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టి 29 మందిని అరెస్టు చేసింది. నిందితులలో 19 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

మృతదేహం నుంచి బంగారు ఆభరణాల చోరీ

మరో అత్యంత అమానవీయ ఘటనలో, నారాయణి నదిలో లభ్యమైన ఒక వరద మృతురాలి మృతదేహం నుంచి ఇద్దరు వ్యక్తులు బంగారు చెవి కమ్మలను దొంగిలించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీని ఆధారంగా స్పందించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం (గ్లేసియర్) విస్ఫోటనం చెందడం వల్ల ఈ భారీ విపత్తు సంభవించింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు వందలాది మంది మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ శనివారం వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో దోపిడీలు, అక్రమాలకు పాల్పడకుండా భద్రతా బలగాలు నిఘాను తీవ్రతరం చేశాయి.

నేపాల్ వరదల ప్రవాహంలో కొట్టుకొచ్చి యూపీ నదుల్లో తేలిన 7 మృతదేహాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha