Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ, రక్షణ విధానాలకు స్వదేశంలోనే గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఇరాన్‌పై అధ్యక్షుడి ఏకపక్ష సైనిక చర్యలను నిలిపివేయాలని, కాంగ్రెస్ (పార్లమెంట్) అనుమతి లేకుండా యుద్ధానికి దిగరాదని కోరుతూ ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) ఆమోదం తెలిపింది.
ఈ చారిత్రాత్మక ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ట్రంప్‌కు స్వంత పార్టీలోనే అసమ్మతి సెగ తగలడం ఇక్కడ విశేషం. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు సొంత అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. విమానాలు నిలిపివేత

వంద బిలియన్ డాలర్ల ఆర్థిక భారం: ట్రంప్ వైఫల్యంపై ఎంపీల ఆగ్రహం
ఈ సందర్భంగా సభలోని ప్రజాప్రతినిధులు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరియు అనవసరపు యుద్ధ వాతావరణం కారణంగా అమెరికా ఖజానాపై ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఆర్థిక భారం పడిందని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఇలాంటి దాడులకు వృధా చేయడం సరికాదని మండిపడ్డారు. అంతేకాకుండా, ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ ముందు అమెరికాను మరింత బలహీనపడేలా చేశాయని, దేశ ప్రతిష్టను మసకబార్చాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడి మిలిటరీ అధికారాలకు బ్రేక్ వేస్తూ సభ తీసుకున్న ఈ నిర్ణయం ట్రంప్ ఆధిపత్యానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

