Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి  నుంచి డీఈఈసెట్ కౌన్సిలింగ్ ..పూర్తి వివరాలు ఇవే!

నేటి నుంచి డీఈఈసెట్ కౌన్సిలింగ్ ..పూర్తి వివరాలు ఇవే!

వార్త 1 week ago

TG DEECET: తెలంగాణ (TG) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET) కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది.

డీఈడీ (D.Ed), డీపీఎస్‌ఈ (DPSE) కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన డీఈఈసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం (జూన్ 6) మధ్యాహ్నం 3 గంటల నుండి అధికారికంగా ప్రారంభం కానుంది.

Read also:AP Mega DSC: డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు పొడిగింపు

 Web Options For D.Ed Admissions Starts From Saturday 3 PM

వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ముందే అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు మరో అవకాశం కల్పించారు.

  • ఆఖరి అవకాశం: వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు (Certificate Verification) హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం గడువును శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. అభ్యర్థులు ఈ లోపే తమ పత్రాలను పరిశీలింపజేసుకోవాలి.

TG DEECET: కౌన్సిలింగ్ ముఖ్యాంశాలు & కీలక తేదీలు

డీఈఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి జూన్ 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
  • ఆప్షన్ల ఎడిట్ (Edit Option): అభ్యర్థులు తాము ఎంచుకున్న కాలేజీల జాబితాను మార్చుకోవడానికి లేదా సరిచేసుకోవడానికి జూన్ 9న ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది.
  • సీట్ల కేటాయింపు (Seat Allotment): ఆప్షన్ల నమోదు ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

టీజీ పీజీఈసీఈటీ ఫలితాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha