Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటి నుంచి దోస్త్-2026 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

నేటి నుంచి దోస్త్-2026 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

వార్త 1 month ago

TG DOST Web Options: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) - 2026లో భాగంగా నేటి(గురువారం) నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read Also: Komatireddy Raj Gopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

 Dost-2026 web options start from today

TG DOST Web Options: అనుబంధ గుర్తింపు ప్రక్రియలో జాప్యం

అయితే యూనివర్సిటీలు ఇప్పటి వరకు తమ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఇవ్వాల్సిన అనుబంధ గుర్తింపును ఇంకా పూర్తి చేయలేదు. ఉన్నత విద్యా మండలి కొత్త కోర్సులను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో కొత్త కోర్సులను తమ కాలేజీల్లో కొనసాగించాలని కోరుకున్న కాలేజీలకు ఇప్పటి వరకు తనిఖీలు పూర్తి చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యమవుతోంది.

రాష్ట్రంలోని 6 సాంప్రదాయక డిగ్రీ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీల్లో ఎక్కువ అనుబంధ కాలేజీలు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన యూనివర్సిటీల్లోనూ ప్రైవేటు కాలేజీలకు అనుబంద గుర్తింపు ఇవ్వడం కోసం తనిఖీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రధానంగా కోర్సు కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలు, కొత్త కోర్సులను ప్రారంభించాలనుకున్న కాలేజీల తనిఖీల్లో ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

విద్యార్థులకు అధికారుల భరోసా

ఈ నేపథ్యంలో అనుబంధగుర్తింపు ఆలస్యం అవుతుందని.. నేడు, రేపటిలోగా కాలేజీల వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామని యూనివర్సిటీలు చెబుతున్నాయి. అయితే వెబ్ ఆప్షన్లు నేటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ.. మే 8 వరకు అవకాశం ఉంటుందని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ల వివరాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషను ఈ నెల 13న ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 70వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఫేజ్-1 రిజిస్ట్రేషన్లను ఈ నెల 15 నుంచి మే 7వరకు అవకాశమిచ్చారు. అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేటి(ఏప్రిల్30) నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 14న తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం మే 15 నుంచి 23 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15 నుంచి మే 25 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 969 కాలేజీల్లో 4,40,107 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సింగూరు ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha