NIMS Hyderabad: హైదరాబాద్‌లోని ప్రముఖ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రి యాజమాన్యం చిన్నారులకు తీపి కబురు అందించింది. ఆగస్టు 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు.
ఈ ప్రత్యేక వైద్య సేవల కోసం బాధితులు ముందస్తుగా ఎలాంటి అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ఆసుపత్రికి వచ్చి నమోదు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Govt Teachers : డ్యూటీ చేయని టీచర్లకు షాక్ ఇచ్చిన తెలంగాణ విద్యాశాఖ
Free heart surgeries for children at NIMS Hospital starting today.
NIMS Hyderabad: రిజిస్ట్రేషన్, ప్రక్రియ వివరాలు
ఉచిత శస్త్రచికిత్స సేవలు పొందగోరే పిల్లల తల్లిదండ్రులు ఆసుపత్రి పాత భవనంలోని 32వ గది వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మొదటి అంతస్తులో ఉన్న సీటీ (CT) ఆఫీస్‌కు వెళ్తే, సంబంధిత సిబ్బంది తగిన సమాచారాన్ని, మార్గదర్శకాలను అందిస్తారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన ఉచిత వైద్యం అందించి, వారికి నూతన జీవితాన్ని ప్రసాదించేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు.

