Car Prices Hike: సొంత కారు కొనాలనుకునే వినియోగదారులకు ప్రముఖ వాహన తయారీ సంస్థలు టాటా మోటార్స్ (Tata Motors) మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) కోలుకోలేని షాక్ ఇచ్చాయి.
ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ఇరు కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ధరల పెంపు సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి రానుంది.
Read Also :Zomato Lay Off's: జొమాటో లేఆఫ్స్.. 250 మంది ఉద్యోగులపై వేటు

Car Prices Hike:టాటా, హ్యుందాయ్ కార్ల ధరల పెంపు వివరాలు
- టాటా మోటార్స్ పెంపు వివరాలు: పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు (Input Costs), ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకునేందుకు ప్యాసింజర్ వాహనాల ధరలను మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ. 25,000 వరకు పెంచుతున్నట్లు టాటా ప్రకటించింది.
- హ్యుందాయ్ మోటార్స్ పెంపు వివరాలు: మరోవైపు హ్యుందాయ్ సంస్థ కూడా తమ కార్ల ధరలను గరిష్ఠంగా 1% వరకు పెంచుతోంది. ముడి పదార్థాల రేట్లు పెరగడం, నిర్వహణ వ్యయాలు మరియు అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల (Geopolitics) ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యుందాయ్ స్పష్టం చేసింది.
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న వేళ ఈ కార్ల ధరల పెంపు వాహన కొనుగోలుదారులపై అదనపు భారంగా మారనుంది.

