Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేటితో ముగియనున్న ITR, LPG కేవైసీ గడువు.. రేపటి నుంచి కొత్త రూల్స్!

నేటితో ముగియనున్న ITR, LPG కేవైసీ గడువు.. రేపటి నుంచి కొత్త రూల్స్!

వార్త 2 weeks ago

New Rules: సెప్టెంబర్ 1 నుంచి సామాన్యుల రోజువారీ జీవితం, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, గ్యాస్ కనెక్షన్లు, వాహనాల కొనుగోలు వంటి వివిధ రంగాలలో రాబోతున్న ప్రధాన మార్పుల వివరాలు ఇవే.

Read Also:LPG Gas eKYC: గ్యాస్‌ వినియోగదారులకు నేడే ఆఖరి తేదీ

New Rules: సామాన్యుడి జేబుపై ప్రభావం!

  • ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్ రద్దు: విమానాశ్రయాల్లో వేగవంతమైన ప్రయాణ సేవల కోసం అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌పై ఇమ్మిగ్రేషన్ సీల్ (స్టాంప్) వేసే పద్ధతిని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నిలిపివేస్తోంది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో డిజిటల్ బోర్డింగ్ పాస్ లేదా ప్రింట్ చూపిస్తే సరిపోతుంది.
  • ఎల్‌పీజీ ఈ-కేవైసీ సమస్యలు: గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన చివరి గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది. కేవైసీ పూర్తి చేయనివారికి గ్యాస్ సేవల్లో ఆంక్షలు రావడం లేదా కనెక్షన్లు తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
  • ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమాప్తం: ఆడిట్ అవసరం లేని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది.
  • ఇంధన ధరల సవరణ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన సమీక్షించే నిబంధనల ప్రకారం ఎల్‌పీజీ సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది.
  • వాహనాలు మరింత ప్రియం: కొత్త కారు కొనాలనుకునే వారికి షాక్ ఇస్తూ టాటా మోటార్స్ తమ మోడళ్లపై గరిష్ఠంగా రూ. 25,000 వరకు, హ్యుందాయ్ మోటార్స్ 1 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Epaper: epaper.vaartha.com

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడిపై 'పిల్' తిరస్కరించిన సుప్రీంకోర్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha